: ఏపీ, తెలంగాణాల్లో మున్సిపల్ కార్మికుల సమ్మెపై హెచ్ఆర్సీలో పిటిషన్


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెపై హెచ్ఆర్సీలో ఈరోజు పిటిషన్ దాఖలైంది. కార్మికుల సమ్మెతో వీధుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారీ స్థాయిలో చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. తక్షణమే మానవ హక్కుల సంఘం ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. మరోవైపు పలు డిమాండ్లతో సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు ప్రభుత్వాలు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News