: కలెక్షన్ల సునామీ సృష్టించిన 'బాహుబలి'... మూడు రోజుల్లో రూ. 150 కోట్ల వసూళ్లు
దేశ సినీ చరిత్రలో 'బాహుబలి' తన సత్తా ఏంటో చాటాడు. మూడు రోజుల్లో సుమారు రూ. 150 కోట్లు కొల్లగొట్టి... బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాడు. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 నుంచి 135 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టిన బాహుబలి మూడో రోజుకు తన కలెక్షన్లను రూ. 150 కోట్ల వరకు పెంచుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. తొలి రోజు కలెక్షన్లలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్'ను కూడా బాహుబలి అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏపీ, తెలంగాణల్లో తొలిరోజు కలెక్షన్లు రూ. 30 కోట్లను దాటాయి. తమిళనాడులో తొలి రోజు రూ. 10.25 కోట్లు రాబట్టి బాహుబలి సత్తా చాటింది.