: సాగర్ సరిహద్దులు మార్చి గూగుల్ క్షమించరాని నేరం చేసింది: గురజాల ఎమ్మెల్యే
నాగార్జున సాగర్ ప్రాజెక్టు సరిహద్దులు మార్చడంపై తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థపై గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ.ప్రభుత్వమే గూగుల్ మ్యాప్ లో సరిహద్దులను మార్చేసిందని మండిపడ్డారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో సాగర్ సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. కానీ గూగుల్ మ్యాప్ లో ఇలా చేయడం సరికాదని ఆయన గుంటూరులో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గూగుల్ కూడా క్షమించరాని నేరం చేసిందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కవ్వింపు చర్యలను మానుకోవాలని కోరారు.