: వాస్తు ఎఫెక్ట్... గత నెలలో కేవలం మూడు సార్లే సచివాలయానికి వచ్చిన కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తును గట్టిగా నమ్ముతారని ఆయన ఆంతరంగికులు చెబుతుంటారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు కూడా అది నిజమే అనిపించేలా ఉన్నాయి. వాస్తు కారణంగానే ఆయన సచివాలయానికి రావడం లేదని పలువురు భావిస్తున్నారు. గత నెలలో కేవలం మూడు సార్లే ఆయన సెక్రటేరియట్ కు వచ్చారు. ఎక్కువ సమయం సీఎం క్యాంప్ ఆఫీసులో గడుపుతున్నారు. లేకపోతే, జూబ్లిహిల్స్ లోని హెచ్ఆర్డీ కార్యాలయం నుంచి పాలన కొనసాగిస్తున్నారు. అంతేకాదు... వాస్తు బాగోలేదన్న కారణంతో సీఎం క్యాంప్ ఆఫీసుకు అనుబంధంగా ఉన్న పెద్ద భవనాన్ని కూడా కేసీఆర్ వాడటం లేదు. అయితే, సచివాలయానికి సీఎం రాకపోవడం వల్ల పలు కీలక ఫైళ్లు పెండింగులో పడిపోతున్నాయని కొందరు చెబుతున్నారు.