: ధర్మపురిలో కేసీఆర్ దంపతులు... బాసరలో కేటీఆర్ కుటుంబం పుష్కర స్నానాలు
గోదావరి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలు సర్వసన్నద్ధమయ్యాయి. రేపు ఉదయం 6.21 గంటలకు రాజమండ్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, 6.31 గంటలకు ధర్మపురిలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ తమ రాష్ట్రాల్లో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా ధర్మపురిలో పుష్కర స్నానమాచరించనున్నారు. కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన కుటుంబసభ్యులతో కలిసి ఆదిలాబాదు జిల్లాలోని సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసరలో పుష్కర స్నానం చేయనున్నారు.