: మధ్యప్రదేశ్ గవర్నర్ తొలగింపుపై బీజేపీ భయపడుతోందా?


దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్ లోని వ్యాపం కుంభకోణలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ఆయనని కూడా వెంటాడుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతో మంది అనుమానాస్పదంగా మరణించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు కూడా దీనిపై అనేక ప్రశ్నలను సంధించింది. ఈ క్రమంలో, గవర్నర్ తనంతట తానే రాజీనామా చేస్తారని బీజేపీ అధినాయకత్వం భావించింది. అయితే, వారి అంచనాలకు విరుద్ధంగా, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా చేసేందుకు ముందుకు రాకపోవడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ గవర్నర్ ను తొలగించాక... ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఆయన వెల్లడిస్తే... రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏదైనా సమస్య వస్తుందా? అన్న కోణంలో బీజేపీ భయపడుతున్నట్టు సమాచారం. గవర్నర్ రాజీనామా విషయంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ప్రశ్నిస్తే... 'చూద్దాం' అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇవన్నీ చూస్తుంటే, రామ్ నరేష్ పై వేటు విషయంలో బీజేపీ నాయకత్వం తీవ్ర సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతోందని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News