: పీఎంఓ తర్వాతి స్థానం 'హెచ్ఎంఓ'దే!... రాజ్ నాథ్ శాఖకు పెరుగుతున్న ఫాలోయింగ్


బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడి నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(హెచ్ఎంఓ)ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న నెటిజన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం హెచ్ఎంఓను 5 లక్షల మంది నెటిజన్లు ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) 68 లక్షల మంది ఫాలోయర్లతో తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానం హెచ్ఎంఓదే. ఇక ఆ తర్వాతి స్థానం మరాఠా నేత సురేశ్ ప్రభు సారథ్యంలోని రైల్వే మంత్రిత్వ శాఖది. ఈ శాఖను ట్విట్టర్ లో 3.96 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే, అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కేవలం 45 వేల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు.

  • Loading...

More Telugu News