: రెండో వన్డేలోనూ టీమిండియా జయభేరి... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం


హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఓపెనర్ విజయ్ 72, కెప్టెన్ రహానే 63, రాయుడు 41 పరుగులు చేశారు. జింబాబ్వే యువ పేసర్ మడ్జివా 4 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం, 272 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య జట్టు 49 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా స్వింగ్ సంచలనం భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో జింబాబ్వేను దెబ్బతీశాడు. జింబాబ్వే జట్టులో చిభాభా (72) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ ముతుంబామి 32, క్రీమర్ 27 పరుగులు చేశారు. కాగా, వరుసగా రెండో విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. తొలి వన్డేలోనూ రహానే సేన నెగ్గిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News