: విద్య కోసం వెళ్లి ఉద్యోగం చూసుకుంటే కుదరదిక... విదేశీ విద్యార్థులకు బ్రిటన్ లో కొత్త రూల్సు
బ్రిటన్ లో స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై, విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత బ్రిటన్ లోనే ఉండి ఉద్యోగాలు చేసుకోవడం కుదరదు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత వారు స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని బ్రిటన్ హోం సెక్రటరీ థెరెసా మే స్పష్టం చేశారు. ఒకవేళ వారు బ్రిటన్ లో ఉద్యోగం చేయాలనుకుంటే, ఉద్యోగ వీసాతో రావాలని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియమనిబంధనలు యూరోపియన్ యూనియన్ బయటి దేశాలన్నటికీ వర్తిస్తాయి. గడచిన 12 నెలల్లో బ్రిటన్ కు 1,21,000 మంది విదేశీ విద్యార్థులు రాగా, వారిలో 51,000 మందే తిరిగివెళ్లారని, మిగిలిన 70,000 మంది బ్రిటన్ లోనే ఉద్యోగాలు చూసుకున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్ కు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 2020 వరకు ఏడాదికి 6 శాతం కన్నా ఎక్కువగా ఉండొచ్చని యూకే ప్రభుత్వం అంచనా వేస్తోంది.