: ఈసీ రంగంలోకి దిగడంతో టీడీపీ వర్గాల్లో కలవరం!
'ఓటుకు నోటు' కేసులో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆడియో, వీడియో ఫుటేజ్ కాపీల కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో తెలుగుదేశం వర్గాల్లో కలకలం పెరిగింది. రేవంత్ రెడ్డి వీడియో, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల రికార్డులతో పాటు మిగిలిన ఆడియో టేపులను సైతం ఈసీ కోరింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి ఉదంతంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్టు భావిస్తున్న దేశం నేతలు, తదుపరి ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చినందున తామూ విచారిస్తామని ఈసి ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. కేసు నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్న ఈసీ ఈ కేసులో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.