: చిప్ కొంచెం - వేగం ఘనం... శాంసంగ్ తయారు చేసిన బుల్లి చిప్ వచ్చేస్తోంది!


ప్రస్తుతం కంప్యూటర్లలో వాడుతున్న చిప్ లతో పోలిస్తే మరింత చిన్నదిగా ఉంటూ, విద్యుత్ వినియోగంలో 50 శాతం తగ్గింపును, వేగంలో 50 శాతం హెచ్చింపును అందించే సరికొత్త బుల్లి చిప్ తయారైంది. సుమారు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 19 వేల కోట్లు) వ్యయంతో శాంసంగ్ చేపట్టిన రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ కు చెందిన గ్లోబల్ ఫౌండరీస్, ఐబీఎంలు దీన్ని తయారు చేశాయి. సిలికాన్ తో పాటు జెర్మేనియంల మిశ్రమాలతో దీన్ని తయారు చేశారు. కంప్యూటర్లలో 14 నుంచి 22 నానో మీటర్ల సైజున్న చిప్ లను వాడుతుండగా, దీని సైజు 7 నానో మీటర్లు మాత్రమే. దీనిలో 20 బిలియన్ ట్రాన్సిస్టర్లను అమర్చవచ్చని దీన్ని తయారు చేసిన పరిశోధకులు వెల్లడించారు. ఈ చిప్ తో మంచి ప్రయోజనాలున్నాయని, వాడకంలోకి వస్తే టెక్నాలజీ పరంగా మరో ముందడుగు వేసినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ చిప్స్ త్వరలోనే విడుదల కానున్నాయని, ఇవి వస్తే ఫోన్ల నుంచి విమానాల టెక్నాలజీ వరకూ పరుగులు పెట్టవచ్చని అంటున్నారు.

  • Loading...

More Telugu News