: మామ నియోజకవర్గానికి వచ్చి దాబాలో తిన్న సోనియా మనవడు రీహాన్ గాంధీ వాద్రా


తన మామ రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీకి వచ్చిన ప్రియాంకా, రాబర్ట్ వాద్రాల కుమారుడు రీహాన్ గాంధీ వాద్రా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త చర్చకు తెరలేపారు. తన మిత్రులతో కలసి అమేథీకి వచ్చిన రీహాన్, రహదారి పక్కనున్న చిన్న హోటల్ లో స్థానిక ఆహారం తిన్నారు. లగ్జరీ కార్లలో వచ్చిన వీరు ఓ దళిత కుటుంబాన్ని కలిశారు. ఆ రాత్రి దోమతెర కట్టిన చిన్న మంచంపై పడుకున్నారని తెలుస్తోంది. అల్పాహారంగా ఆలూ పరాటా తిన్నారని, ఓ గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలపై వాకబు చేశారని సమాచారం. కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News