: సింహాలు, పులులు, ఏనుగులు ఉన్న చోటికి డైనోసార్ వచ్చింది: రాంగోపాల్ వర్మ ట్వీట్ల సునామీ


ప్రముఖ హీరోలు మహేష్ బాబు, రవితేజ తదితరులు నటించిన చిత్రాలను సింహాలు, పులులు, ఏనుగులతో పోల్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి బాహుబలి పేరిట డైనోసార్ వచ్చిందని అభివర్ణించారు. రాజమౌళిని చూసి దర్శకులందరూ జెలసీతో ఉన్నారని, ఇకపై ఎవరైనా ఆయన బాటలో నడవాల్సిందేనని తనదైన శైలిలో ట్వీట్లు గుప్పించారు. భారత సినీ చరిత్రలో హీరోల కన్నా సినిమాయే పెద్దదిగా కనిపించడం బాహుబలితో మొదలైందని, అయితే, త్వరలో వచ్చే 'శ్రీమంతుడు', 'కిక్-2' చిత్రాల్లో మహేష్, రవితేజలే స్టార్లుగా కనిపిస్తారని అన్నారు. బాహుబలి స్టార్ హీరోలందరికీ కనువిప్పని వ్యాఖ్యానించిన ఆయన తదుపరి విడుదలయ్యే చిత్రాలు 5డీ స్థాయిలో ఉంటేనే విజయం సాధిస్తాయని అన్నారు. రాజమౌళి తన తదుపరి చిత్రానికి ఇంకో నాలుగేళ్లు తీసుకుంటే చిత్ర పరిశ్రమే ఉండదని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News