: 'అణు భారతం'... నీటిలో నుంచి అణ్వస్త్రాలు ప్రయోగించే సామర్థ్యమున్న దేశాల్లోకి ఇండియా!


భూమిపై నుంచి, ఆకాశం నుంచి అణ్వస్త్రాలు ప్రయోగించే సామర్థ్యమున్న భారత్ త్వరలో మరో ఘనతను దక్కించుకోనుంది. సముద్రాల దిగువ నుంచి సబ్ మెరైన్ల ద్వారా అణు మిసైల్స్ తో దాడి చేసే టెక్నాలజీని అందిపుచ్చుకోనుంది. అత్యాధునిక న్యూక్లియర్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్-ఆరిహంట్ నుంచి మిసైల్ లాంచింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్) నూతన డైరెక్టర్ డాక్టర్ ఎస్ క్రిస్టోఫర్ వివరించారు. ఇదే తరహా సబ్ మెరైన్లను మరో రెండింటిని తయారు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, వచ్చే జనవరిలో పరీక్ష జరుగుతుందని ఆయన అన్నారు. తదుపరి మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ తయారీని 'కే-4' కోడ్ నేమ్ తో అభివృద్ధి చేయనున్నట్టు ఆయన వివరించారు. అణ్వస్త్రాలను తొలుత వినియోగించరాదన్న నిబంధనకు ఇండియా కట్టుబడి వుంటుందని క్రిస్టోఫర్ స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం చైనా వద్ద ఐదు న్యూక్లియర్ సబ్ మెరైన్లు ఉన్నాయి. వీటి నుంచి జులంగ్-2 అణు మిసైల్ ను ప్రయోగిస్తే 8 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చు. సుమారు 5,500 కి.మీ. దూరంలోని టార్గెట్ ను తాకే అగ్ని-4 క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఈ డిసెంబరులో చేపట్టనుంది.

  • Loading...

More Telugu News