: అమెరికా, దక్షిణాఫ్రికాలో ఉండే 'హనీబాడ్జర్ డాగ్' నల్లమలలో కనిపించింది!


అత్యంత అరుదైన హనీబాడ్జర్ డాగ్ (తేనె కుక్క) నల్లమలలో కనిపించింది. లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో ఉండే ఈ శునకాలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అడవుల్లో ఉన్నట్టు జాతీయ వన్యప్రాణి గణన విభాగం నిర్వహించిన సర్వేలో తేలింది. నల్లమల అడవుల్లో తేనె కుక్కల సంఖ్య అధికంగానే ఉందని అధికారులు తెలిపారు. శరీరం పై భాగంలో తెల్లగా, మిగతా భాగంలో నల్లగా కనిపించే ఈ కుక్కలు దట్టంగా ఉండే అడవుల్లో బొరియలు చేసుకుని నివాసం ఉంటాయి. పండ్లు, గడ్డలు తిని బతికే ఇవి మనుషులు కనపడితే దాడి చేస్తాయని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News