: తుర్కెమిస్తాన్ తో ఏడు కీలక ఒప్పందాలు చేసుకున్న మోదీ


ప్రధాని మోదీ తుర్కెమిస్తాన్ పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని ఆష్ గాబట్ లో మోదీ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆ దేశ తొలి అధ్యక్షుడు సపర్ మురాట్ నియాజోవ్ కు నివాళి అర్పించారు. అనంతరం ఆ నగరంలోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తరువాత ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సమాలోచనలు చేశారు. అనంతరం ఏడు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాపీ సహజవాయువు పైప్ లైన్ తుర్కెమిస్తాన్, భారత మైత్రిలో కీలకమైనదని ప్రధాని పేర్కొన్నారు. దక్షిణ, మధ్య ఆసియా అనుసంధానం ద్వారా అపార ఆర్థిక అవకాశాల సృష్టి జరుగుతోందని అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయంతో ఏకీభవించిన తుర్కెమిస్తాన్ అధ్యక్షుడికి మోదీ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News