: సీబీఐటీ కాలేజ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా?
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చైతన్య భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీబీఐటీ), ఎంజీఐటీలను టీఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వమే ఈ కాలేజీలకు భూమి ఇచ్చింది. ఈ కాలేజీల కమిటీ కూడా సొసైటీల చట్టం కింద ఏర్పడింది. కాలేజీ యాజమాన్యంలో విభేదాలు, ఆర్థిక అవకతవకలు, ఇతర రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ట్రస్టులో ప్రముఖ వ్యక్తులైన మాలకొండారెడ్డి, బీఎస్ రెడ్డి వర్గాలకు పడకపోవడం, కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి సలహాల మేరకు కాలేజీ నడుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, టీఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.