: ఎమ్మెల్యే చింతమనేనిని విప్ పదవి నుంచి తొలగించండి: సీపీఐ రామకృష్ణ
మహిళా తహశీల్దార్ వనజాక్షితో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఆ పార్టీ విప్ పదవి నుంచి వెంటనే తొలగించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా నూజివీడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా రెవెన్యూ ఉద్యోగులు వ్యవహరించాలని సూచించారు.