: సీఎం జిల్లాలో మహిళా తహశీల్దార్ పై దాడికి యత్నం
కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ పై టీడీపీ ఎమ్మెల్యే దాడి అంశం చర్చనీయాంశం అయింది. ఈ గొడవ ఇంకా చల్లారక ముందే సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామంలో ఆక్రమణకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకోవడానికి తహశీల్దార్ నారాయణమ్మ వెళ్లారు. అయితే, ఆ గ్రామ సర్పంచ్ రమణారెడ్డి చెరువు వద్దకు చేరుకుని తహశీల్దార్ ను నిలువరించే ప్రయత్నం చేశారు. కులం పేరుతో దూషించి, దాడికి యత్నించాడు. దీంతో, నారాయణమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని, కులం పేరుతో దూషించలేదని సదరు సర్పంచ్ చెబుతున్నాడు.