: వీళ్లు క్రికెటర్లు కాదు... ఐఎస్ఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టారు!
భారత్ లో జరిగే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ రెండో ఎడిషన్ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో భారత సాకర్ ఆటగాళ్ల ధర కోటి రూపాయలపైనే పలకడం విశేషం. మామూలుగా ఐపీఎల్ లో క్రికెటర్లకు కోట్లు పలకడం చూస్తుంటాం. ఆ కోవలోనే ఐఎస్ఎల్ వేలం కూడా సాగింది. స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రిని ముంబయి సిటీ ఎఫ్ సీ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఛెత్రి బేస్ ప్రైస్ రూ.80 లక్షలు కాగా, ముంబయి సిటీ ఎఫ్ సీ అదనంగా మరో రూ.40 లక్షలు వెచ్చించింది. భారత సాకర్ టీమ్ కెప్టెన్ అయిన ఛెత్రి చేరికతో ముంబయి అటాకింగ్ పదునుదేరనుంది. ఇక, యూజెనిసన్ లింగ్డో రూ.1.05 కోట్ల ధర పలికాడు. వేలంలో పూణే ఎఫ్ సీ అతడిని దక్కించుకుంది. లింగ్డో గత సీజన్ లో బెంగళూరు ఎఫ్ సీ తరపున ఆడాడు. ఐఎస్ఎల్ తాజా సీజన్ అక్టోబర్ 3న మొదలై డిసెంబర్ 6న ముగుస్తుంది.