: బాహుబలిలో రాజమౌళి కూడా నటించాడోచ్!


భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన 'బాహుబలి'లో దర్శకుడు రాజమౌళి కూడా నటించాడు. ప్రేక్షకులకు ఒక సీన్ లో రాజమౌళి కనిపించగానే సినిమా థియేటర్లు ఈలలు, కేకలతో దద్దరిల్లిపోయాయి. రానా, ప్రభాస్ లు కలసి తమ రక్షణ రహస్యాలు ఎత్తుకెళ్లిన వాళ్ల కోసం దొంగలుండే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రాజమౌళి మద్యం అమ్ముతున్న వ్యక్తి పాత్రలో కనిపించి నవ్వులు పండించాడు. కొద్ది క్షణాల సేపు మాత్రమే రాజమౌళి కనిపించినా, అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించాడు. కాగా, గతంలో 'సై' చిత్రంలోనూ వేణుమాధవ్ పక్కన అనుచరుడిగా రాజమౌళి కనిపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News