: ప్రమాదం అంచున ప్రపంచం...ఐసిస్ లో 1100 మంది మైనర్లు


ఐఎస్ఐఎస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇస్లాం రాజ్యస్థాపన పేరుతో ప్రపంచంపై విరుచుకు పడేందుకు తీవ్రమైన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా లక్షల వేతనాలు ఆఫర్ చేస్తూ రిక్రూట్ మెంట్లు చేపట్టిన ఐసిస్, తాజాగా 1100 మంది మైనర్లను సంస్థలోకి తీసుకుంది. వీరికి వివిధ పరీక్షలు పెట్టి, అందులో ఉత్తీర్ణులైన వారిని తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ విషయాన్ని సిరియాలో పనిచేస్తున్న లండన్ కు చెందిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలిపింది. విధుల్లోకి తీసుకున్న మైనర్లను దళాలలోకి పంపి కఠినమైన శిక్షణ ఇస్తారు. అనంతరం ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి సమాజం మీదకి వదులుతారు. అనంతరం వారు పెను విధ్వంసాన్ని సృష్టిస్తారు. దీంతో మైనర్ల చేరికపై మానవహక్కుల సంఘాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనర్లు ఉగ్రవాదం పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారో అర్థం కావడం లేదని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News