: రివ్యూలు చదవొద్దు... ఎవరేం చెప్పినా వినొద్దు: బాహుబలిపై అల్లు శిరీష్ స్పందన
బాహుబలి గురించి ఎటువంటి రివ్యూలు చదవొద్దని, ఎవరో చెప్పిన మాటలు వినొద్దని హీరో అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని, సినిమా చూస్తున్న రెండున్నర గంటలూ తాను మైమరచిపోయానని అన్నారు. భారత చలనచిత్ర చరిత్రలో ఇటువంటి సినిమా గతంలో రాలేదని అన్నారు. తెలుగు నేలపై నుంచి ఇటువంటి గొప్ప చిత్రం వచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపారు. దీనిపై ట్విట్టర్లో రాయాల్సి వస్తే 10 నుంచి 15 ట్వీట్లు పెట్టాల్సి వస్తుందని వివరించారు. సినిమాను వర్ణించేందుకు మాటలు రావడం లేదని, నేరుగా థియేటరుకు వెళ్లి సినిమా చూడాలని పిలుపునిచ్చారు.