: వారు కలిస్తే అంతకన్నా ఇంకేం కావాలి?: అమెరికా ఆనందం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లు కలసి చర్చలు జరుపుతామంటే, తమకది ఆనందాన్ని కలిగించే విషయమేనని అమెరికా వెల్లడించింది. రెండు దక్షిణాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఈ చర్చలు సహకరించాలని కోరుకుంటున్నట్టు యూఎస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. "భారత్, పాకిస్థాన్ నేతల మధ్య సమావేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇండియా, పాక్ ల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెండువైపులా కృషి చేయాల్సి ఉంది" అని ఆయన రోజువారీ న్యూస్ కాన్ఫరెన్స్ లో భాగంగా మీడియాకు వివరించారు. ద్వైపాక్షికంగా ఇరు దేశాలూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నామని అన్నారు.