: ఫీజు చెల్లించలేదని విద్యార్ధుల నిర్భంధం
ఫీజు కట్టలేదని విద్యార్ధులను నిర్బంధించిన కృష్ణాజిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి టెక్నోస్కూల్ వ్యవహారంపై మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. సమగ్ర విచారణ చేపట్టాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారని మంత్రి తెలిపారు.