: విప్రో కిరీటంలో మరో మాణిక్యం... రూ. 595 కోట్లతో డెన్కార్క్ సంస్థ కొనుగోలు!


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల ఔట్ సోర్సింగ్ దిగ్గజం విప్రో డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్న 'డిజిగ్నిట్'ను విలీనం చేసుకోనుంది. ఇండియాలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థగా ఉన్న విప్రో ఈ డీల్ కోసం 85 మిలియన్ యూరోలు (సుమారు రూ. 595 కోట్లు) వెచ్చించనున్నట్టు సంస్థ తెలిపింది. "మా సంస్థలో భాగంగా ఉన్న డిజిటిల్ సేవల అనుబంధ కంపెనీ విప్రో డిజిటల్, త్వరలోనే డిజిగ్నిట్ ను విలీనం చేసుకోనుంది. డిజిటల్ మార్కెట్లో మరింత ముందడుగు వేసేందుకు ఈ కొనుగోలు ఉపకరిస్తుంది" అని విప్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. విప్రో డిజిటల్ తొలి విలీనం ఇదే కావడం గమనార్హం. వచ్చే మూడేళ్లలోగా విప్రో రూ. 595 కోట్లను డిజిగ్నిట్ కు చెల్లించాల్సి వుంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News