: ప్రేక్షకుల ముందుకు ‘బాహుబలి’... థియేటర్ల వద్ద భారీ జనసందోహం!


టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గడచిన అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాదులో మూడు థియేటర్లు, విజయవాడలో 30 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శన లాంఛనంగా ప్రారంభమైంది. ఇక కొద్దిసేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా 4,000లకు పైగా థియేటర్లలో ‘బాహుబలి’ విడుదలైంది. ‘బాహుబలి’ చిత్రం విడుదలైన అన్ని థియేటర్లకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద భారీ జనసందోహం నెలకొంది. గతానుభవాల నేపథ్యంలో పోలీసులు చిత్రం విడుదలైన అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రదర్శనకు సంబంధించి చాలా షోలకు టికెట్లు ముందే బుక్ అవడంతో టికెట్ కౌంటర్లన్నీ మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News