: అందరికీ కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి
తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు 'బాహుబలి' ఫీవర్ నెలకొంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానుల్లో కుతూహలం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానుందని తెలిపారు. ఈ సందర్భంగా తనతో ప్రస్థానం సాగించిన టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా కోసం విలువైన సమయాన్ని కేటాయించి, ఎన్నో త్యాగాలు చేసిన 'బాహుబలి' నటీనటులకు, అశేష అభిమానం ప్రదర్శించే ఫ్యాన్స్ కు, మీడియాకు ధన్యవాదాలని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.