: మా ఇంట్లో పెత్తనమంతా మా ఆవిడదే!: శత్రుఘ్న సిన్హా


జీవితంలో వివాహం ఎన్నో మార్పులకు నాంది పలుకుతుందని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అది నిజమేనని అందుకు ఉదాహరణ తానేనని ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా తెలిపారు. 35వ వివాహ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహమైన మొదట్లో తన భార్య ప్రాధమ్యాలకు, ఇప్పటి ప్రాధమ్యాలకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు తన భార్యకు తాను 5వ ప్రాధాన్యమైపోయానని వాపోయారు. తొలి నాలుగు ప్రాధామ్యాల్లో కుమారులు లవ్, కుశ్, సోనాక్షి వరుసగా ఉండగా, వారి తరువాత స్థానాన్ని కుశ్ భార్య తరుణా సిన్హా ఆక్రమించిందని, ఆ తరువాతి స్థానం తనదని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. అప్పట్లో తాను మాట్లాడితే తను వినేదని, ఇప్పుడు ఆమె మాట్లాడితే తాను వింటున్నానని చెప్పారు. అప్పట్లో ఇంటి బాధ్యతంతా తనదేనని, తానెలా చెబితే పూనమ్ అలా చేసేదని, ఇప్పుడు ఇంటి పెత్తనమంతా ఆమెదేనని, ఆమె ఎలా చెబితే అలా వింటున్నానని శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News