: టీమిండియాతో వన్డే సిరీస్ కు జింబాబ్వే జట్టు ప్రకటన... రేపు తొలి వన్డే
జింబాబ్వేలో టీమిండియా పర్యటన శుక్రవారం జరిగే తొలి వన్డేతో ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య హరారేలో రేపు మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోసం 15 మందితో కూడిన జింబాబ్వే జట్టును గురువారం ప్రకటించారు. రెండు టి20 మ్యాచ్ లకు జట్టును తర్వాత ప్రకటిస్తామని జింబాబ్వే చీఫ్ సెలక్టర్ గివ్ మోర్ మకోని తెలిపారు. జింబాబ్వే జట్టు: ఎల్టన్ చిగుంబురా (కెప్టెన్), సికిందర్ రజా బట్, రెజిస్ చకాబ్వా, చమునోర్వా చిభాభా, గ్రేమ్ క్రీమర్, నెవిల్లే మడ్జివా, హామిల్టన్ మసకద్జా, రిచ్మండ్ ముతుంబామి, తినాషే పన్యంగరా, వుసిముజి సిబాందా, డొనాల్డ్ టిరిపానో, ప్రాస్పర్ ఉత్సేయా, బ్రియాన్ విటోరీ, మాల్కమ్ వాలర్, షాన్ విలియమ్స్.