: జెట్ ఎయిర్ వేస్ విమానానికి బాంబు బెదిరింపు... మస్కట్ లో దించివేత
జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, ఆ విమానాన్ని మస్కట్ లో అత్యవసరంగా దించివేశారు. ఈ విమానం ముంబయి నుంచి దుబాయ్ వెళుతుండగా, ఏటీసీ అధికారులు బాంబు బెదిరింపు గురించి చెప్పడంతో, విమాన పైలట్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దాంతో, ఎయిర్ పోర్టును కొద్దిసేపు మూసివేసి, విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. అనంతరం, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.