: ఓటుకు నోటు కేసుపై ఆరా తీసిన కేసీఆర్


ఓటుకు నోటు కేసు పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ రోజు కేసీఆర్ తో ఏసీబీ డీజే ఏకే ఖాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై వీరు చర్చించారు. మరోవైపు, ఈనెల 12వ తేదీన నిజాం కాలేజీ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఇఫ్తార్ విందును ఇవ్వనుంది. ఈ విందుకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఏకే ఖాన్ కే ముఖ్యమంత్రి అప్పగించారు. దీంతో, ఇఫ్తార్ ఏర్పాట్లపై కూడా వీరు చర్చించారు.

  • Loading...

More Telugu News