: ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది: మోదీ


ఉక్రెయిన్ అంశంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలు విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని మోదీ పేర్కొన్నారు. "గ్లోబల్ ఎకానమీ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. యూరప్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా సంక్షోభంలో పడ్డాయి" అని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో, బ్రిక్స్ దేశాలు తమ సహకార సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సి ఉందని అన్నారు. బ్రిక్స్ దేశాలు ఇతర అభివృద్ధి చెందిన కూటములతోనూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ వాణిజ్య మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News