: ఆముదాలవలసలో దొంగనోట్ల చలామణి... నలుగురు అరెస్టు


శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో దొంగనోట్ల చలామణీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.37,600 విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు సీఐ నరేందర్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల కిందట ఖమ్మం జిల్లాలో నకిలీనోట్లను చలామణి చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News