: భీమవరం పెళ్లి సంబంధంపై ప్రభాస్ స్పందన


భీమవరం పెళ్లి సంబంధం కుదిరిందనే వార్తలపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. తనకు ఇంకా సంబంధాలు చూడటం లేదని... ఈ వార్తలన్నీ వదంతులే అని కొట్టి పారేశాడు. బాహుబలి సినిమా విడుదలయ్యాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన ప్రభాస్... ఆ తర్వాత పెళ్లి సంగతి చూద్దామని నవ్వేశాడు. అమ్మాయిల గురించి మాట్లాడుతూ, సీజన్ ను బట్టి అమ్మాయిలపై తన ఇష్టాలు మారుతుంటాయని చెప్పాడు. రెండేళ్ల క్రితం వరకు బాగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం ఉండేదని... ఇప్పుడు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతానో తనకే తెలియడం లేదని తెలిపాడు.

  • Loading...

More Telugu News