: మధ్యప్రదేశ్ గవర్నర్ పై వేటుకు అవకాశం... హోంశాఖ కార్యదర్శితో రాజ్ నాథ్ భేటీ
మధ్యప్రదేశ్ గవర్నర్ పదవి నుంచి రామ్ నరేష్ యాదవ్ కు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మధ్యాహ్నం హోంశాఖ కార్యదర్శితో యాదవ్ వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. వ్యాపం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ను తొలగించాలంటూ పలువురు న్యాయవాదుల పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చి నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ పై కోర్టుకు ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై రాజ్ నాథ్ చర్చించినట్టు తెలుస్తోంది.