: ఆన్ లైన్ లో 'బాహుబలి' ఫస్ట్ క్లాస్ టికెట్ల విక్రయం: విశాఖ జేసీ


'బాహుబలి' చిత్రం టికెట్లను ఆన్ లైన్ లో పెడుతున్నామని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో రూ.50 నుంచి రూ.75 టికెట్లను ఆన్ లైన్ లో సేల్ చేయాలని థియేటర్ యజమానులను ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకు వారు కూడా అంగీకరించారన్నారు. అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్లతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేసీ వివరించారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించామన్నారు.

  • Loading...

More Telugu News