: ఏపీ ఆర్టీసీ బస్టాండ్లలో ఉచిత వైఫై, రోమింగ్ సేవలు


ఏపీలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ఉచిత వైఫై, రోమింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను రాష్ట్రంలో అందిస్తోంది. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లకు వైఫై సేవలు విస్తరించాలని ఇటీవల ఆర్టీసీ ఎండీ సాంబశివరావు బీఎస్ ఎన్ఎల్ ను కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2జీ, 3జీ సర్వీసులు అందించేందుకు మరిన్ని సెల్ టవర్లను పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఈ సేవలతో ఏ బస్సు ఏ ప్రాంతంలో ఉందో ప్రయాణికులు తమ మొబైల్స్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News