: నాడు పవన్ కాళ్లు పట్టుకున్న వాళ్లు నేడు జుట్టు పట్టుకుంటున్నారు: అంబటి
గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ఆయన జుట్టు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే టీడీపీ నేతలకు కోపం వస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారు టీఆర్ఎస్ తో కలసి పోయారని విమర్శిస్తున్నారని, అది సరైన పద్ధతికాదని హితవు పలికారు. ఎవరు తిట్టినా వారిని కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించడం ఒక్క దేశం నేతలకే చెల్లిందని అన్నారు. రుణాలు మాఫీ చేయడం మానేసిన ఏపీ సర్కారు మాఫియాలా తయారైందని అంబటి ఆరోపించారు.