: పవన్ కల్యాణ్ మాకు శ్రేయోభిలాషి... చంద్రబాబును కేసీఆర్ కాపీ కొడుతున్నారు: గాలి
టీడీపీ, బీజేపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషి అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. తమకు సహాయ, సహకారాలు అందించిన పవన్ ను తాము ఎంతో గౌరవిస్తామని చెప్పారు. మరోవైపు టీఎస్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన ఆయన... కేసీఆర్ భాష సీఎం స్థాయికి తగ్గట్టు లేదని, భాషలో ఆయనకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విపక్ష నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ... అలీబాబా దొంగలను కూడా కేసీఆర్ మించిపోయారని దుయ్యబట్టారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలను కేసీఆర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని... ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పదేపదే అనడం సరికాదని మండిపడ్డారు.