: గోదావరి తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక 'సారె'


గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోదావరి తల్లికి ప్రత్యేకంగా 'సారె' సమర్పించబోతోంది. గోదావరికి సమర్పించే శ్రీవారి పట్టువస్త్రం, పసుపు, కుంకుమ పూజా సామగ్రికి అర్చకులు ఈరోజు తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో సారెను రాజమండ్రికి పంపేందుకు టీటీడీ అధికారులు శోభాయాత్రను ప్రారంభించారు. శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సారెను గోదావరి తల్లికి సమర్పిస్తామని ఈవో సాంబశివరావు తెలిపారు.

  • Loading...

More Telugu News