: టీడీపీ ఎమ్మెల్యే దాడిపై భగ్గుమన్న రెవెన్యూ ఉద్యోగులు...ఏపీ వ్యాప్తంగా నిరసనలు


కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జరిపిన దాడిపై ఏపీ రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమన్నారు. ఇప్పటికే రెవెన్యూ అసోసియేషన్ సలహాతో ఎమ్మెల్యేపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే కేసుతో సరిపెట్టి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే సహించేది లేదని రెవెన్యూ ఉద్యోగులు తేల్చిచెప్పారు. రెండు రోజుల్లోగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తాజాగా ఏపీలోని పలు జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉద్యోగులు నిరసనలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News