: వికలాంగుల సంక్షేమ పథకాల ప్రచారకర్తగా సివిల్స్ టాపర్
యూపీఎస్సీ సివిల్స్ -2014 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ ను వికలాంగుల సంక్షేమ పథకాల ప్రచారకర్తగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వికలాంగుల సాధికారత విభాగం కింద ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆమెను ప్రచారకర్తగా నియమించే అవకాశముందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ తెలిపారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకులో నిలిచిన తొలి వికలాంగురాలిగా ఇరా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఆమె ఐఆర్ఎస్ అధికారిణిగా ఉన్నారు.