: పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం...‘బిల్లు’పై చర్చకు ఎంపీల గైర్హాజరుపై ఆగ్రహం


విభజన చట్టం అమలుపై టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సమసేలా లేదు. మొన్నటి పవన్ కల్యాణ్ ట్వీట్లకు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. దీనిపై నిన్న ‘‘జైలుకైనా, కోర్టుకైనా సిద్ధం’ అంటూ పవన్ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం మరోమారు ఆయన ట్విట్టర్ వేదికగా సీమాంధ్ర ఎంపీలపై విరుచుకుపడ్డారు. అసలు విభజన చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ఎంతమంది ఎంపీలు సభలో ఉన్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘పార్లమెంట్ లో విభజన చట్టం సవరణ బిల్లు ప్రవేశఫెట్టిన సమయంలో నాకు తెలిసి సభలో ఐదుగురు ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారు. మిగిలిన వారికేమైంది?’’ అని సదరు ట్వీట్లలో పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News