: రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి!: టీడీపీ ఎంపీలకు జనసేన సవాల్
టీడీపీ ఎంపీలపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజమండ్రిలోని నందంగనిరాజు సెంటర్లో 'జనసేన' కార్యకర్తలు ఎంపీ సుజనా చౌదరి, కేశినేని నాని దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ ఎంపీలు పవన్ కల్యాణ్ ను విమర్శించడంలో పౌరుషం చూపించడం కాదని, చేతనైతే ప్రత్యేక హోదా తీసుకురావాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా తేవడం చేతకాని ఎంపీలు, 'ఎందుకు తేలేదు?' అని ప్రశ్నిస్తే ఎదురుతిరుగుతున్నారని వారు మండిపడ్డారు. రాష్ట్ర అవసరాలపై ఎంపీలు పోరాడాలని వారు సూచించారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేయకపోయినా గెలిచేవారమనే ధైర్యం ఎవరికైనా ఉంటే, వారు తక్షణం పదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని 'జనసేన' కార్యకర్తలు సవాలు విసిరారు.