: ఏడాది బిడ్డపై ఈ లొల్లేంటి?: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం పసిగుడ్డు అని... పక్కవాడు దీన్ని ఏదో చేయాలనుకుంటున్నప్పుడు... తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాల్సిన అవసరం లేదా? అని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబుకు 13 జిల్లాలు ఉన్నాయని... అక్కడి సమస్యలను ఆయన చూసుకుంటే చాలని చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేని కొంటూ చంద్రబాబు పట్టుబడ్డారని... అందులో మనకు ప్రమేయం లేదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా, కేసీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరితే వారికి తగు గౌరవం ఇస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొంత మందికి పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునేంత వరకు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పని అంటూ విమర్శించారు. డీఎస్ ఏనాడూ విమర్శించలేదని... అందుకు ఆయనకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News