: డోన్ట్ టచ్ మీ...అంటేనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా?: భూమా కేసులో కోర్టు వ్యాఖ్య


తమతో వాగ్వాదానికి దిగిన వైసీపీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కర్నూలు కోర్టు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాగ్వివాదం సందర్భంగా ‘‘డోన్ట్ టచ్ మీ’’ అంటేనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా? అంటూ పోలీసులను నిలదీసింది. అంతేకాక సదరు పదాలు వాడిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కుదరదని కూడా తేల్చిచెప్పింది. ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద నుంచి తన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వెళ్లిపొమ్మన్న పోలీసులపై భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న తన కూతురును వెళ్లిపొమ్మని చెప్పే అధికారం మీకెక్కడిదంటూ ఆయన పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ దేవదానంను ‘‘డోన్ట్ టచ్ మీ’’ అంటూ భూమా నాగిరెడ్డి గద్దించారు. దీనినే ఆధారంగా తీసుకున్న పోలీసులు భూమాపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు చెల్లదని తేల్చిచెప్పిన కోర్టు, భూమాకు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News