: చంద్రబాబు ఆదేశాలను సైతం కేశినేని నాని ధిక్కరించారా?
టీడీపీ ఎంపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూటిగా, స్పష్టంగా విమర్శలు గుప్పించడంతో... వారు అవాక్కయ్యారు. గోడలను చూడ్డానికి పార్లమెంటుకు వెళుతున్నారా? అని ప్రశ్నించడంతో... ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో, దీనిపై ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించాలని నిర్ణయించిన ఎంపీలు... ప్రెస్ మీట్ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఘాటుగా మాట్లాడరాదని, పవన్ ను టార్గెట్ చేయరాదని పార్టీ ఆఫీస్ నుంచి ఎంపీలకు డైరెక్షన్స్ వెళ్లాయట. అయినప్పటికీ, పవన్ కల్యాణ్ తనను డైరెక్ట్ గా విమర్శించడంతో, తట్టుకోలేకపోయిన కేశినేని నాని పవన్ పై మోతాదుకు మించి మాట్లాడారని టీడీపీ నేతలు అంటున్నారు. దీనిపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.