: డచ్ కంపెనీ చేతికి 'కింగ్ ఫిషర్' బ్రాండ్


లిక్కర్ కింగ్ గా పేరున్న విజయ్ మాల్యా చేతుల్లోని యూబీ గ్రూప్ సైతం జారిపోయింది. దేశంలోని బీరు విక్రయాల్లో 50 శాతం మార్కెట్ వాటావున్న కింగ్ ఫిషర్ బ్రాండును అందిస్తున్న యూబీ గ్రూపులో మెజారిటీ వాటాలు డచ్ లిక్కర్ దిగ్గజం హెనికిన్ అధీనంలోకి వెళ్లిపోయాయి. విజయమాల్యా తనఖా పెట్టిన వాటాలను హెనికిన్ సొంతం చేసుకుంది. దీంతో యూబీ గ్రూప్ లో హెనికిన్ వాటా 42 శాతాన్ని దాటగా, విజయ్ మాల్యా వాటా 32 శాతానికి పరిమితమైంది. గతంలో మాల్యాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా, వాటాలను కొనుగోలు చేశామని హెనికిన్ ప్రకటించింది. ఈ వాటాల కొనుగోలు తరువాత చైర్మన్ నుంచి సీఎఫ్ఓ, బోర్డు డైరెక్టర్లు తదితర పదవులు హెనికిన్ సూచించిన వాళ్లకు దక్కనున్నాయి.

  • Loading...

More Telugu News