: ‘తప్పు’లో కాలేసిన టీ ఏసీబీ...సండ్ర రిమాండ్ రిపోర్టులో తేదీలు తప్పుగా నమోదు!


ఓటుకు నోటు కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు తప్పులో కాలేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో పెను చర్చకు తెర లేపిన ఈ కేసులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు తేదీలను కూడా తప్పుగా రాసేశారు. అంతేకాదు, తేదీలను తప్పుగా నమోదు చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును సరిచూసుకోకుండానే కోర్టుకు అందించారు. వివరాల్లోకెళితే... ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు మొన్న రాత్రే అరెస్ట్ చేశారు. మొన్న ఉదయం విచారణకు వచ్చిన సండ్రను సాయంత్రం దాకా విచారించిన పోలీసులు రాత్రి పొద్దుపోయిన తర్వాత అరెస్ట్ చేశారు. నిన్న సండ్రను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు ఆయన రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు అందించారు. ఈ నెల 6 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో మాత్రం 6వ తేదీ బదులు 7వ తేదీ అని ప్రస్తావించారు. అంతేకాక విచారణ కోసం సండ్ర ఈ నెల 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. వాస్తవానికి 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు సండ్రను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

  • Loading...

More Telugu News